Top
Sneha TV

ఎమ్మెల్యేలను స్టార్ హోటల్ లో పెడితే.. నేనే సీఎం!!

X

'వంద మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి స్టార్ హోటల్ లో పెడితే..సాయంకాలానికి సీఎం అవుతా'..అంటూ 'దగ్గుబాటి రానా' పలికిన డైలాగ్స్ తో అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఆయన నటించిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాలో 'రానా' పవర్ ఫుల్ డైలాగ్స్ తో అదరగొట్టారు. ఇటీవలే ఆయన పలు విభిన్నమైన పాత్రలు పోషించుకుంటూ ముందుకెళుతున్న సంగతి తెలిసిందే. 'బాహుబలి' చిత్రంతో ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా 'రానా'కు మంచి పేరు వచ్చింది. తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో 'రానా' సరసన 'కాజల్' నటించింది. ట్రైలర్ ఆసక్తికరంగా ఉందని అభిమానులు పేర్కొంటున్నారు. సినిమాపై అభిమానుల అంచనాలను ట్రైలర్ అమాంతం పెంచేసిందని టాక్. 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాను సొంత బేనర్ సురేష్ ప్రొడక్షన్స్ లో దగ్గుబాటి సురేష్ బాబు నిర్మిస్తున్నారు. సంగీతం అనూప్ రూబెన్స్ అందిస్తున్నారు.

Next Story
Share it