Top
Sneha TV

సాయిధరమ్ తేజ్ తొలిప్రేమ !

X

జవాన్ సినిమా సెట్ లో వుండగానే మరో రెండు సినిమాలు లైన్ లో పెట్టాడు హీరో సాయిధరమ్ తేజ్. వివి వినాయక్ డైరక్షన్ ఒకటి. ఈ మరొకటి ఇప్పుడు ఫిక్సయింది. కరుణాకరన్ డైరక్షన్ లో నిర్మాత కేఎస్ రామారావు నిర్మించే సినిమా ఫైనల్ అయ్యింది.

తొలి ప్రేమ లాంటి ఓ స్వీట్ లవ్ స్టోరి ఒకటి చేయాలనే ఆలోచన వుంది సాయి. దీంతో దర్శకుడు కరుణాకరన్ తో ఓ సినిమా ను కూడా ఫిక్స్ చేసుకున్నాడట. మొత్తానికి సాయి ఆలోచన బాగానే వుంది కానీ, ఇప్పుడు కరుణాకరన్ మునపటి ఫామ్ లో లేడు. మరి ఆయన నుండి ఎలాంటి ప్రేమకధ వస్తుందో , పవన్ కళ్యాణ్ కు తొలి ప్రేమ వచ్చినట్లు, సాయికి కూడా యుత్ ఫుల్ క్రేజ్ వస్తుందో చూడాలి.

Next Story
Share it