Top
Sneha TV

'దువ్వాడ' మొదటి మాట

X

అల్లుఅర్జున్- పూజాహెగ్డే జంటగా టాలీవుడ్ భారీ ఎత్తున శుక్రవారం రిలీజైన మూవీ 'దువ్వాడ జగన్నాథమ్'. ప్రతి సినిమాకీ డిఫరెంట్ స్టోరీలను ఎంచుకుంటూపోతున్న బన్నీ, ఎప్పుడూ కనిపించని గెటప్‌లో కనిపించాడు. కాకపోతే ట్రైలర్ చూసినవాళ్లు బన్నీ డబుల్ చేశాడని అనుకున్నారు. ఫస్టాఫ్ ఎంటర్‌టైన్‌మెంట్, బ్రాహ్మణుడి రోల్‌లో అల్లు అర్జున్ చాలా ప్రెష్‌గా కనిపించాడు. అదుర్స్‌లో ఎన్టీఆర్‌ను మరిపించినా, ఆ రేంజ్ మించి ఫెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు అనిపిస్తుంది. డైలాగ్స్ చెప్పడం కోసం బన్నీ హార్డ్ గానే వర్క్‌చేశాడు. స్టోరీ విషయానికొస్తే రొటీన్.. కొత్తదనం ఏమీలేదు.

చిన్నప్పుడే డీజేని చేరదీసి భయమంటే తెలియని యువకుడిగా ఓ పోలీస్ ఆఫీసర్ పెంచుతాడు. బన్నీ అండర్ కవర్ ఆపరేషన్ ఎపిసోడ్ ఆకట్టుకోవడం ఖాయం. గత సినిమాలతో పోల్చితే అల్లుఅర్జున్ తన రోల్‌, అండర్ కవర్ ఆఫీసర్‌గా పూర్తి న్యాయం చేశాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా సాదాసీదాగా ఉన్నప్పటికీ, స్టోరీ పరిధి ఎక్కువ హైప్ చేయకుండా జాగ్రత్త పడ్డాడు డైరెక్టర్. వివాదాస్పదమైన మడిలో ఓడిలో గుడిలో పాట పిక్చరైజ్ బాగుంది.

సింపుల్ మూవ్‌మెంట్స్‌తో అల్లు అర్జున్- పూజా డ్యాన్స్ ఇరుగదీశారు. బికినీ సీన్‌లో పూజా హెగ్డే.. 'బిల్లా'లో అనుష్కని మైమరిపించింది.

Next Story
Share it