Top
Sneha TV

'ఫస్ట్ లుక్' ఇదైనా ఫుల్ 'ఖుషి' అయ్యేవారేమో!

X

మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తోన్న "స్పైడర్" ఫస్ట్ లుక్ పోస్టర్స్ నిరుత్సాహానికి గురిచేసిన విషయం తెలిసిందే. అంచనాలను అందుకోవడంలో విఫలమైన ఈ పోస్టర్స్ కంటే కూడా, తమిళంలో ప్రిన్స్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పోస్ట్ చేసిన రెండు ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఒకటి 'పోకిరి' తరహాలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో కాగా, మరొకటి మాత్రం 'ఏజెంట్ శివ' ఆన్ డ్యూటీ అనే తరహాలో అదిరిపోయే లుక్ లో దర్శనమిస్తున్నాడు.

ఆఫీస్ బ్యాగ్ ధరించుకుని, చక్కగా టక్ చేసుకుని, టై కట్టుకుని, స్టైలిష్ గాగుల్స్ తో దర్శనమిస్తున్న ఈ ప్రిన్స్ పోస్టర్ ఫ్యాన్స్ ను పిచ్చెక్కిస్తోంది. బహుశా 'ఫస్ట్ లుక్'గా దీనిని విడుదల చేసినా, ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యే వారని చెప్పడంలో సందేహం లేదు. ఇలా టక్, టై కాస్ట్యూమ్స్ తో ప్రిన్స్ కొత్తగా కనిపిస్తుండడంతో, అభిమానుల ఆనందం రెట్టింపవుతోంది. 'ఇంతముందెన్నడూ చూడని మహేష్ ను మీరు చూస్తారు, ఇది నా గ్యారెంటీ' అని దర్శకుడు మురుగదాస్ చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యం అనిపించే విధంగా ఈ వర్కింగ్ స్టిల్స్ సందడి చేస్తున్నాయి.

Next Story
Share it