Top
Sneha TV

'మిస్టర్' .. ఎలా ఉన్నాడంటే ?

X

'మిస్టర్'గా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు వరుణ్ తేజ్. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన డిఫరెంట్ రొమాటింక్ ఎంటర్ టైనర్ గా చెబుతోన్న మిస్టర్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. మిస్టర్ కు సెన్సార్ సభ్యులు యు/ఎ సర్టిఫికేట్ ను జారీ చేశారు. సినిమా నిడివి 2గం॥ల 30 ని॥షాలు.

ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ లు జతకట్టనున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ చాలా ఫ్రెష గా ఉన్నట్టు సినిమా
చూసిన సెన్సార్ సభ్యుల టాక్. శ్రీనువైట్ల మిస్టర్ ని చాలా కొత్తగా డీల్ చేసినట్టు చెబుతున్నారు. తెర కలర్ ఫుల్ గా ప్రెష్ గా కనిపించిందని
చెబుతున్నారు. వరుణ్ నటనలోనూ చాలా ఇంపుమెంట్ కనబడిందని చెబుతున్నారు. ఇదే నిజమైతే.. వరుణ్ తేజ్ ఖాతాలో ఓ హిట్ పడినట్టే.

ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జే మేయర్. ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జి నిర్మాతలు.

Next Story
Share it