Top
Sneha TV

క్లైమాక్స్ తేడా కొట్టిందట

X

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం 'దువ్వాడ జగన్నాథమ్'. హరీష్ శంకర్ దర్శకుడు. బన్ని సరసన పూజా హెగ్డే జతకట్టనుంది. షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. జూన్ లో డీజేని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే క్లైమాక్స్ షూటింగ్ హైదరాబాద్ జరగాల్సి వుంది. అయితే, షూటింగ్ మొదలుకాలేదు. దీంతో.. డీజే క్లైమాక్స్ లో తేడా కొట్టిందని.. బన్ని సూచనతో దర్శకుడు హరీష్ శంకర్ క్లైమాక్స్ లో మార్పులు చేస్తున్నాడని చెప్పుకొంటున్నారు. ఇది నిజమైతే.. డీజే క్లైమాక్స్ లో తేడా కొట్టిందన్న మాట నిజమే.

ఇప్పటికే రిలీజైన డీజే టీజర్ కోటికి పైగా వ్యూస్ ని సొంతం చేసుకొని రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో బన్నీ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. ఓ పాత్రలో బ్రాహ్మణ యువకుడిగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఆ పాత్ర లుక్ రిలీజైంది. మరో పాత్రకి సంబంధించిన లుక్ రిలీజ్ కావాల్సివుంది.

ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దిల్ రాజు నిర్మాత.

Next Story
Share it