Top
Sneha TV

సౌత్ 'క్వీన్' క్యాన్సిల్

X

కంగనా రనౌత్ నాయికగా నటించిన బాలీవుడ్ చిత్రం 'క్వీన్'. వికాస్ భాల్ దర్శకుడు. విమర్శకుల ప్రశంసలు అందుకొంది. 2013లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ బాలీవుడ్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడీ చిత్రం ప్రాంతీయ బాషల్లోకి అనువాదం అవుతోంది. మిల్కీ బ్యూటీ తమన్నా తమిళ్ 'క్వీన్'గా రాబోతున్నట్టు జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ప్రముఖ నటి రేవతి దర్శకత్వంలో తమిళ 'క్వీన్' కోసం ప్రయత్నాలు మొదలెట్టారు. సుహాసిన మణిరత్నం రైటర్ గా క్వీన్ సినిమాను రీమేక్ చేయాలని భావించారు.

ఇప్పుడు తమిళ్ 'క్వీన్' క్యాన్సిల్ అయినట్టు సమాచారమ్. అందుకు గల కారణాలు మాత్రం తెలియడం లేదు. మరోవైపు, తెలుగు 'క్వీన్' కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రమేష్ అరవింద్ దర్శకత్వంలో తెలుగు క్వీన్ తెరకెక్కనుంది. తెలుగు, కన్నడ బాషల్లోనూ క్వీన్ ని తీసుకొచ్చేందుకు రమేష్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. తెలుగు క్వీన్ గా కూడా తమన్నాని కనిపించబోతున్నట్టు సమాచారమ్.

తెలుగు క్వీన్ కూడా క్యాన్సిల్ అయితే.. మొత్తంగా సౌత్ 'క్వీన్' క్యాన్సిల్ అయినట్టే.

Next Story
Share it