Top
Sneha TV

రాంగోపాల్ వర్మపై కేసు నమోదు

X

'వంగవీటి'తో బెజవాడ రౌడీయిజాన్ని చూపించే ప్రయత్నం చేశాడు రాంగోపాల్ వర్మ. రిలీజ్ కి ముందే వంగవీటి కుటుంబం అభ్యంతరం చెప్పింది. ఒకట్రెండు సార్లు వంగవీటి, దేవినేని కుటుంబ సభ్యులతో వర్మ చర్చలు కూడా జరిపారు. చివరికి వంగవీటి కుటుంబం చెప్పిన అభ్యంతరాలని పట్టించుకోకుండానే సినిమాని రిలీజ్ చేశాడు వర్మ.

తాజాగా, ఈ చిత్రంపై వంగవీటి కుటుంబం కోర్టు మెట్లెక్కింది. వర్మతో పాటు నిర్మాత దాసరి కిరణ్ పై కేసు వేశారు. వంగవీటి కుటుంబ సభ్యుల అభ్యంతరాలను పట్టించుకోకుండా సినిమాను తెరకెక్కించారని, సినిమా కారణంగా తమ పరవుపోయిందని వంగవీటి రాధ కోర్టును ఆశ్రయించారు. సినిమా రిలీజైన చాలా రోజుల తర్వాత వంగవీటి కుటుంబం కోర్టుకెక్కడంతో 'వంగవీటి' చిత్రం మరోసారి హెడ్ లైన్స్ లో నిలిచింది. మరీ.. ఈ కేసు నుంచి వంగవీటి ఎలా బయటపడుతారనేది చూడాలి.

Next Story
Share it