Top
Sneha TV

జెర్సీ విషయంలో నాని చెప్పింది జరుగుతుందా..!

X

నాచురల్ స్టార్ నాని, గౌతం తిన్ననూరి కాంబినేషన్ లో క్రేజీ మూవీగా వస్తున్న సినిమా జెర్సీ. ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం జరిగింది. ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా విక్టరీ వెంకటేష్ వచ్చారు. నాని ఓ మంచి నేచురల్ యాక్టర్ అని వెంకీ ప్రశంసించారు.

ఇక ఈ ఈవెంట్ లో నాని మాత్రం మైక్ అందుకుని అదరగొట్టాడు. జెర్సీ సినిమాతో సూపర్ హిట్ కొడుతున్నాం అంతే ఇంక దానిలో డౌటే లేదు అన్నట్టుగా మాట్లాడాడు. జెర్సీ ట్రైలర్ రిలీజ్ ముందు నాని ఇదే విధంగా మాట్లాడితే నాని కాస్త అతి చేస్తున్నాడని అనుకున్నారు కాని ట్రైలర్ చూసిన తర్వాత ఆడియెన్స్ ఫీలింగ్ కూడా అదే.

పక్కాగా చెప్పాలంటే ట్రైలర్ తోనే నాని జెర్సీకి ఓ పాజిటివ్ వైబ్ వచ్చింది. అయితే ట్రైలర్ ఏముంది సినిమాలో ఇంకా పెద్ద మ్యాటరే ఉంది అంటున్నారు. ఈమధ్య ఆడియెన్స్ ను ఎమోషనల్ గా కదిలించి సూపర్ హిట్ అందుకుంటున్నారు. అలానే జెర్సీ అర్జున్ అదేనండి మన నాని కూడా అదే తరహాలో ఓ సూపర్ ఎమోషనల్ మూవీతో వస్తున్నాడు.

జెర్సీ సినిమా మొత్తం ఒక ఎత్తైతే క్లైమాక్స్ మరో ఎత్తని అంటున్నారు. సినిమా మొత్తం చూసి బరువెక్కిన హృదయాలతో బయటకు వస్తారని అంటున్నారు. నాని చెప్పినదంతా చూస్తుంటే జెర్సీ సూపర్ హిట్ పక్కా అన్నమాట. సితార బ్యానర్ లో మరో సూపర్ హిట్ పడ్డట్టే. అందుకే ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా దుమ్ముదులిపేస్తుంది.

Next Story
Share it