Top
Sneha TV

సినీ రచయితలు, దర్శకులకు దొరికిందో వేదిక!

X

హైదరాబాద్: ఔత్సాహిక సినీ రచయితలకు, దర్శకులకు తెలుగునాట ఓ వేదిక ప్రారంభం కాబోతోంది. ఇకపై కథలు పట్టుకుని స్టూడియోలు, నిర్మాతల చుట్టూ తిరిగే అవసరం లేదంటున్నారు సినీ నటుడు నవదీప్. సినీ పరిశ్రమ వైపు ఆశగా చూసేవారి కోసం.. అవకాశాలను కల్పించే దిశగా 'సీ స్పేస్' అనే సంస్థను ఆయన టీమ్ ప్రారంభిస్తోంది. ఇలాంటి వేదిక దేశంలోనే ఇదే మొదటిది అంటున్నారు. ఉగాది రోజున 'సీ స్పేస్‌'ను ప్రారంభిస్తున్నట్టు ఆయన చెప్పారు. కనెక్ట్, కొలాబొరేట్, క్రియేట్ అనే లక్ష్యాలతో తమ సంస్థ పని చేస్తుందన్నారు. ''కథలు రాసుకొనే వారికి 'సీ స్పేస్' ఓ అడ్డాలాంటిది. కథ చెప్పడానికి, సినిమా చేయడానికి ఓ వేదిక కావాలి. ఓ సినిమా నిర్మించాలంటే చాలా ఖర్చు అవుతుంది. 'పెళ్లి చూపులు' సినిమా చేయడానికి తరుణ్ భాస్కర్ లాంటి వాళ్లు ఎంత కష్టపడ్డారో తెలిసిందే. ఇలాంటి తరుణ్ భాస్కర్‌లు ఎంతో మంది బయట ఉన్నారు. ప్రొడ్యూస్ చేసి అందరికీ ఛాన్స్‌లు ఇవ్వలేకపోవచ్చు. మేము సపోర్ట్ సిస్టమ్‌ను తీసుకు వస్తున్నాం'' అంటున్నారు నవదీప్.

Next Story
Share it