Top
Sneha TV

ఆదికి ఈసారైనా గురి కుదురుతుందా?

X

డైలాగ్ కింగ్ సాయికుమార్ కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు డజను సినిమాలు చేశాడు ఆది. పెద్దగా ఫిజిక్ లేకపోయినా, నటనలో ఈజ్ చూపిస్తూ ఛాన్సులు దక్కించుకున్నాడు. 'ప్రేమ కావాలి' నుంచి ఇటీవల బుర్రకథ దాకా అతడు చేసిన సినిమాల్లో ఒకటోరెండో తప్ప అన్నీ దెబ్బయిన బాపతే. తండ్రి సాయికుమార్ కున్న పలుకుబడితో కెరీర్‌ని ఎంతోకొంత బిల్డ్ చేసుకుంటున్నాడు. అయినా ల్యాండ్ మార్క్ మూవీ అంటూ ఒక్కటీ లేకపోవడంతో దాదాపు ఫేడవుట్ అయ్యాడు ఆది.

చాలా గ్యాప్ తీసుకుని ఈసారి 'జోడీ' పేరుతో ఒక మూవీకి ఫిక్స్ అయ్యాడు. విశ్వనాధ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో శ్రద్ధ శ్రీనాధ్ హీరోయిన్. సాయి వెంకటేష్ గుర్రం, పద్మజ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఉగాది సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు భావనా క్రియేషన్స్ బేనర్ ప్రకటించింది. సో.. వికారి నామ సంవత్సరమైనా ఆది సినిమా కెరీర్‌ని మంచి మలుపు తిప్పుతుందేమో చూడాలి.
Next Story
Share it