Top
Sneha TV

ఆ మూవీ రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేసిన సాయిపల్లవి!

X

తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య పరభాష హీరోయిన్లు వరుస విజయాలు అందుకుంటూ మంచి సక్సెస్ బాటలో నడుస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'ఫిదా' చిత్రంలో హీరోయిన్ గా సాయి పల్లవి నటనకు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఫిదా అయ్యారు. అచ్చమైన తెలంగాణ యాసలో మాట్లాడుతూ..భానుమతి, హైబ్రీడ్ పిల్లా అంటూ సాయి పల్లవి చలాకీ తనంతో పాటు అమాయకత్వం కలగలిపి నటించింది. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో సాయి పల్లవికి వరుసగా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఛాన్సులు రావడం మొదలు పెట్టాయి.

ఇటీవల ధనుష్ హీరోగా 'మారి 2'చిత్రంలో సాయి పల్లవి నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలుగు,తమిళ ,మలయాళ భాషల్లో సాయిపల్లవికి మంచి క్రేజ్ వుంది. ఏ పాత్రను అంగీకరించినా ఆ పాత్రలో ఎంతో సహజంగా ఒదిగిపోవడంతో ఈ అమ్మడికి వరుసగా ఛాన్సులు వస్తున్నాయి. కథను తప్ప ఆమె తన పారితోషికానికి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వదు. పాత్రను గురించి తప్ప దాని నిడివి గురించి ఆలోచించదు. తాజాగా సాయి పల్లవి రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా తన మంచితనాన్ని చాటుకుంది.

తాను తీసుకున్న పారితోషికాన్ని తిరిగి ఇచ్చేసింది. రీసెంట్ గా శర్వానంద్ హీరోగా 'పడి పడి లేచె మనసు' చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. అయితే ఈ చిత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఈ చిత్రానికి గాను తాను తీసుకున్న పారితోషికాన్ని తిరిగి ఇచ్చేసిందట. సాధారణంగా తమ చిత్రాలు ఆడనప్పుడు స్టార్ హీరోలు కొంతమంది ఇలా చేస్తుంటారు. అయితే సాయి పల్లవి తన పారితోషికం ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Next Story
Share it