Top
Sneha TV

పేట రిలీజ్ అవ్వడం కష్టమే..కారణం అదేనా..?

X

2.ఓ తో సూపర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్..తాజాగా పేట తో సంక్రాంతి కానుకగా జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తమిళనాట గ్రాండ్ గా విడుదల కాబోతుండగా , తెలుగులో మాత్రం టెక్నికల్ బ్రేక్ పడిందని అంటున్నారు. ఈ టెక్నికల్ చిక్కు ఏంటో తెలుసా..థియేటర్స్ సమస్య. అవును ఈ చిత్రాన్ని తెలుగులోను గ్రాండ్ గా భారీ ఎత్తున విడుదల చేయాలనీ నిర్మాత అశోక్ ప్లాన్ చేసాడు. కానీ ఆయన అనుకున్నది ఒకటి ఇక్కడ జరిగింది ఒకటి.

సంక్రాంతి బరిలో మూడు తెలుగు పెద్ద చిత్రాలు రిలీజ్ అవుతుండడం తో ఉన్న థియేటర్లులాన్ని ఆ మూడు చిత్రాలకే వెళ్లిపోయాయట. దీంతో పేట ను రిలీజ్ చేద్దామంటే ఎక్కడ కూడా థియేటర్స్ దొరకడం లేదట. దీంతో చేసేది ఏమి లేక సినిమాను వాయిదా చేయాలనీ నిర్మాత భావిస్తున్నాడట. థియేటర్స్ సమస్య అని చెప్పకుండా టెక్నికల్ చిక్కు వచ్చిందని చెపుతున్నట్లు తెలుస్తుంది. కుదిరితే జనవరి 18 న పేట తెలుగులో విడుదల కావొచ్చు అని అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో.

Dailyhunt
Next Story
Share it