Top
Sneha TV

ఎన్టీఆర్ కు కూడా థియేటర్ కష్టాలు తప్పేలా లేదు..

X

కేవలం డబ్బింగ్ చిత్రం పేట కు మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ సమస్య అని నిన్నటి వరకు అనుకున్నాం..కానీ ఈ సమస్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు కి కూడా తప్పేలా లేదు. సంక్రాంతి బరిలో ఏకంగా మూడు తెలుగు పెద్ద సినిమాలు వస్తుండడం అవి కూడా అగ్ర నిర్మాతలు నిర్మించిన వారే కావడం తో థియేటర్స్ సమస్య తీవ్రం అయ్యింది..ఎక్కువ థియేటర్స్ దిల్ రాజు , అల్లు అరవింద్ , యూవీ క్రియేషన్స్ చేతిలో ఉండడంతో వారి సినిమాలే సంక్రాంతి బరిలో ఉండడం తో మిగతా సినిమాలకు థియేటర్స్ పెద్ద ప్రాబ్లమ్ అయ్యింది.

ముఖ్యంగా భారీ అంచనాల మధ్య వినయ విధేయ రామ సినిమా వస్తుండడం , ఈ చిత్రాన్ని యూవీ వాళ్ళు కొనడం, అదే క్రమంలో ఏరియాల పరంగా దిల్ రాజు నైజాం, ఉత్తరాంధ్ర రైట్స్‌ ను దిల్ రాజుకు అమ్మడం చక, చకా జరిగిపోయింది. ఇప్పుడు వీళ్లకు థియేటర్స్ కొరత లేదు, పైగా దిల్ రాజు నిర్మించిన ఎఫ్-2 సైతం సంక్రాతి రేస్ లో ఉండడంతో ఈ రెండు సినిమాలకు కలపి భారీగానే థియేటర్స్ ను బ్లాక్ చేసేసాడు దిల్ రాజు.

ఇరాక్ ఎన్ఠీఆర్ బయోపిక్ కి ఎక్కువ థియేటర్లు దొరకడం కష్టంగా మారింది. ముఖ్యం గా నందమూరి బాలకృష్ణ కు పట్టున్న ప్రాంతాలలో ఎన్టీఆర్ కథానాయకుడు కి థియేటర్స్ దొరకలేదట. దీంతో అభిమానులు బాధపడుతున్నారు. తమ అభిమాన హీరో సినిమా చూద్దామంటే కుదరడం లేదని , సినిమా చూడాలంటే ఎక్కడికో వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోతున్నారట. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని సురేష్ బాబు , ఆసియన్ వారు విడుదల చేస్తున్నారు. దిల్ రాజు, అల్లు అరవింద్ , యూవీ వారితో పోలిస్తే వీరికి థియేటర్స్ తక్కువగా ఉన్నాయి. అందుకే ఎన్టీఆర్ కు థియేటర్స్ సమస్య వచ్చిందని మాట్లాడుకుంటున్నారు.

Next Story
Share it