Top
Sneha TV

సంక్రాంతి సినిమాల రన్ టైం ఎంతో తెలుసా..?

X

అసలైన సినీ పండగా మరో ఒక రోజులో మొదలు కాబోతుంది..ఎన్టీఆర్ కథానాయకుడు తో మొదలు కాబోతున్న సినీ సంక్రాంతి ఎలా ఉండబోతుందో అని యావత్ సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సంక్రాంతికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాల్గు పెద్ద సినిమాలు పోటీ పడడం తో సంక్రాంతి పోరు నువ్వా నేనా అనేలా ఉంది. ఇక ఈ నాల్గు సినిమాల రన్ టైం ఫై ఓ లుక్ వేద్దాం.

ముందుగా బాలకృష్ణ - క్రిష్ కలయికలో 'ఎన్టీఆర్ కథానాయకుడు' ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఈ చిత్రం క్లీన్ యు సర్టిఫికెట్ తో 2గంటల 51 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

రెండవ చిత్రం సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'పేట'. ఈ చిత్రం ఈ నెల 10న తమిళ్ తో పాటు తెలుగులోను విడుదలకానుంది. ఈచిత్రం యు/ఏ సర్టిఫికెట్ తో 2గంటల 52నిమిషాల నిడివి తో ప్రేక్షకులముందుకు రానుంది. ఈ మధ్య కాలంలో ఇంత రన్ టైం కలిగిన సినిమా కూడా ఇదే కావడం విశేషం.

మూడవ చిత్రం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కిన యాక్షన్ ప్యాక్ వినయ విధేయ రామ. మిగిలిన మూడు సినిమాలు ఒకెత్తు, ఈ సినిమా ఒకెత్తు. రంగస్థలం తర్వాత చరణ్ నుండి వస్తున్న సినిమా కావడం తో దీని ఫై అంచనాలు మాములుగా లేవు. ఎప్పుడెప్పుడు చూద్దామా అని మెగా అభిమానులు ఆతృతగా ఉన్నారు. ఇక ఈ చిత్రం యు/ఏ సర్టిఫికెట్ తో 2గంటల 26నిమిషాల రన్ టైంతో విడుదల కానుంది.

ఇక సంక్రాంతి రేస్ లో చివరిగా వస్తున్న చిత్రం ఎఫ్2. వెంకటేష్ , వరుణ్ తేజ్ లు మొదటి సారి కలిసి నటించడం అలాగే హ్యాట్రిక్ చిత్ర విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలే వున్నాయి. ఇటీవల విడుదలైన వీడియోస్ , ఆడియో సైతం సినిమా ఫై అంచనాలు పెంచేసాయి. ఇక ఈచిత్రం యు/ఏ సర్టిఫికెట్ తో 2గంటల 28నిమిషాల నిడివి తో ప్రేక్షకులముందుకు రానుంది.

మొత్తం మీద ఈ నాల్గు సినిమాల కోసం యావత్ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. మరి సంక్రాంతి బరిలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

Next Story
Share it