Top
Sneha TV

తొలిసారి ఆ ముగ్గురు నటించబోతున్నారు..

X

డైలాగ్ కింగ్ అనగానే టక్కున గుర్తుకొచ్చే నటుడు సాయి కుమార్..నటుడి గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సాయి కుమార్ కు ఎంతో క్రేజ్ ఉంది. ఈయన తో పాటు ఆయన తమ్ముళ్లు రవి శంకర్, అయ్యప్ప లు సైతం ప్రేక్షకులకు సుపరిచితులే..వీరిలో అయ్యప్ప మాత్రం కాస్త వెనుకంజలో ఉన్నాడు. ఇటీవలే ఈయన కూడా 'బాహుబలి', 'కాటమరాయుడు', 'కేజీఎఫ్' చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నాడు.

ఇప్పుడు ఈ ముగ్గురు ఒకే సినిమాలో కనిపించబోతున్నారు. 'భరాటే' అనే కన్నడ సినిమాలో
వీరు నటిస్తున్నారు. శ్రీమురళి హీరోగా చేతన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి కుమార్, రవిశంకర్, అయ్యప్పకు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రవిశంకర్, అయ్యప్ప షూటింగ్‌లో పాల్గొన్నారని, త్వరలో సాయికుమార్ కూడా పాల్గొంటారని కన్నడ సినీ వర్గాలు చెపుతున్నాయి. ఇక ఈ ముగ్గురు ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నారనే వార్త అభిమానుల్లో సంబరాలు నింపుతుంది.

Next Story
Share it