Top
Sneha TV

ఎన్టీఆర్ కథానాయకుడు మూవీకి ఎపిలో రెండు అదనపు షోలకు అనుమతి..

X

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న మూవీ ఎన్టీఆర్ కథానాయకుడు. ఈ మూవీ ఈ నెల తొమ్మిదో తేదిన ప్రేక్షకుల ముందుకురానుంది.. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు కాగా రెండో భాగం ఎన్టీఆర్ మహానాయకుడు . ఎన్టీఆర్ మహానాయకుడు మూవీని ఫిబ్రవరి 7వ తేది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి ఎం ఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నాడు.ఈ మూవీలో బాలయ్య తో పాటు విద్యాబాలన్ , రానా , నందమూరి కళ్యాణ్ రామ్ , నిత్యా మీనన్ , రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు నటిస్తున్నారు. కాగా ఈ మూవీ ఎపిలో వారం రోజుల పాటు రెండు అదనపు షోలకు అక్కడి ప్రభుత్వ అనుమతి మంజూరు చేసింది. ఉదయం 5 గంటల నుంచి 11 గంటల మధ్య ఈ రెండు షోలను అక్కడి థియేటర్లలో ప్రదర్శించుకోవచ్చు.. అనుమతి కోసం చిత్ర నిర్మాణ సంస్థ లిఖిత పూర్వంగా ఎపి ప్రభుత్వానికి లేఖ రాసింది.. దీనిని పరిశీలించిన అనంతరం ప్రిన్సిపల్ సెక్రట్రీ అనురాధ రెండు షోలకు అనుమతి ఇస్తూ జివోను విడుదల చేశారు.. కాగా, క్లీన్ యు సర్టిఫికెట్ పొందిన ఈ మూవీ నిడివి 171 నిమిషాలుౌ.

Next Story
Share it