Top
Sneha TV

'యన్‌టిఆర్' ప్రయాణాన్ని వీక్షించండి

X

అమెరికాలోని తెలుగువారికి కల్యాణ్‌రామ్‌ సందేశం

హైదరాబాద్‌: విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవితాధారంగా తెరకెక్కిన 'యన్‌టిఆర్‌' చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. తొలి భాగమైన 'యన్‌టిఆర్‌: కథానాయకుడు' చిత్రం జనవరి 9న విడుదల కాబోతోంది. అయితే అమెరికాలో ఉన్న తెలుగువారి కోసం 8న ప్రీమియర్‌ షోను ప్రదర్శించనున్నారట. ఈ విషయాన్ని ఎన్టీ రామారావు మనవడు, సినీ నటుడు కల్యాణ్‌ రామ్‌ వీడియో ద్వారా వెల్లడించారు.

'అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు. 'యన్‌టిఆర్' సినిమా జనవరి 8న అమెరికాలో ప్రీమియర్‌ షో ద్వారా మీ ముందుకు రాబోతోంది. చాలా అద్భుతమైన గొప్ప సినిమా చూడబోతున్నారు. ఆ కాన్ఫిడెన్స్‌ నాకుంది. మీరు చూసి ఎంజాయ్‌ చేస్తారన్న నమ్మకం కూడా ఉంది. అమెరికాలో ఉన్న తెలుగువారి ద్వారా సినిమా విడుదల కాబోతోంది. కాబట్టి.. ఎన్టీఆర్‌ ప్రయాణం మొత్తాన్ని థియేటర్‌లో వీక్షించండి. ధన్యవాదాలు' అని పేర్కొన్నారు.

ఈ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్‌ పాత్రలో ఆయన కుమారుడు బాలకృష్ణ నటించారు.ఎన్‌బీకే ఫిల్స్మ్‌ పతాకంపై బాలకృష్ణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి సహ నిర్మాతలు. ఎంఎం కీరవాణి స్వరాలు అందించారు. రెండో భాగం 'యన్‌టిఆర్‌: మహానాయకుడు' చిత్రాన్ని ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story
Share it