Top
Sneha TV

నా పెళ్లా.. నిజమా?: శ్రుతిహాసన్‌

X

మీడియా కథనంపై నటి స్పందన

ముంబయి: కథానాయిక శ్రుతి హాసన్‌ త్వరలో వివాహం చేసుకోబోతున్నారని తెగ ప్రచారం జరుగుతోంది. ఆమె యూరప్‌కు చెందిన మైఖెల్‌ కోర్సేల్‌తో ప్రేమలో ఉన్నారని చాలా రోజులుగా వదంతులు వస్తున్న సంగతి తెలిసిందే. మైఖెల్‌ కూడా భారత్‌కు వచ్చి శ్రుతి తల్లిదండ్రులతో మాట్లాడారు. కమల్‌ హాసన్‌తో కలిసి చెన్నైలో జరిగిన బంధువుల పెళ్లికి కూడా హాజరయ్యారు. దీంతో వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లిందని చెప్పుకొచ్చారు.

ఇటీవల శ్రుతి లండన్‌ వెళ్లారు. మైఖెల్‌ను కలవాలని చాలా ఆతృతగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఆమె అక్కడే క్రిస్మస్‌, నూతన సంవత్సర వేడుకల్ని జరుపుకొన్నారు. స్నేహితులు, మైఖెల్‌తో కలిసి దిగిన ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. దీంతో శ్రుతి పెళ్లి ప్రచారం మళ్లీ మొదలైంది. 2019లో ఆమె వివాహం చేసుకోబోతున్నారని ఓ పత్రిక రాసిన వార్తను శ్రుతి ఖండించారు. ఆ వార్తను రీట్వీట్‌ చేస్తూ.. 'నిజంగా?.. ఇది నాకు వార్తే' అంటూ పరోక్షంగా విమర్శించారు.

శ్రుతి తెలుగులో 'కాటమరాయుడు', హిందీలో 'బెహెన్‌ హోగీ తెరి' సినిమాల తర్వాత మరో కొత్త ప్రాజెక్టుకు సంతకం చేయలేదు. ఆమె కమల్‌ కథానాయకుడిగా నటిస్తున్న 'శభాష్‌ నాయుడు'లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోపక్క పలు మ్యూజిక్‌ ఆల్బమ్‌ల కోసం పనిచేస్తున్నారు.

Next Story
Share it