Top
Sneha TV

వెంకటేశ్‌ చిత్రంలో దర్శకుడే అతిథా?

X

హైదరాబాద్‌: సినిమాల్లో అగ్ర హీరో, హీరోయిన్లు అతిథి పాత్రల్లో నటించడం చూస్తూనే ఉంటాం. కానీ ఆ సినిమాలను తెరకెక్కించిన దర్శకులే అతిథి పాత్రల్లో నటించడం అరుదు. 'అదుర్స్‌'లో దర్శకుడు వి.వి వినాయక్, 'బాహుబలి'లో రాజమౌళి అతిథి పాత్రల్లో మెరిశారు. ఇప్పుడు విక్టరీ వెంకటేశ్‌ కథానాయకుడిగా నటించిన 'f2' చిత్రంలో ఈ సినిమాకు దర్శకత్వం వహించిన అనిల్‌ రావిపూడి కేమియో పాత్రలో కన్పించనున్నారట. ఈ మేరకు ఫిలిం వర్గాల్లో వదంతులు వినిపిస్తున్నాయి. సినిమా చివర్లో అనిల్‌ కాసేపు కనిపించి సందడి చేస్తారని టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఈ చిత్రంలో వరుణ్‌ తేజ్‌ మరో కథానాయకుడిగా నటించారు. మెహరీన్‌, తమన్నా కథానాయికలు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Next Story
Share it