Top
Sneha TV

"పడి పడి లేచె మనసు" సినిమా రివ్యూ

X

టైటిల్ : పడి పడి లేచె మనసు
జానర్ : రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌
నటీనటులు : శర్వానంద్‌, సాయి పల్లవి, మురళీశర్మ, సుహాసిని
మ్యూజిక్ : విశాల్‌ చంద్రశేఖర్‌
దర్శకత్వం : హను రాఘవపూడి
నిర్మాత : ప్రసాద్‌ చుక్కపల్లి, సుధాకర్‌ చెరుకూరి

యంగ్ అండ్ సక్సెస్‌ఫుల్ హీరో శర్వానంద్‌, అందమైన ప్రేమ కథల దర్శకుడు హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కిన సినిమా "పడి పడి లేచె మనసు". సాయి పల్లవి హీరోయిన్. క్రిష్ణగాడి వీర ప్రేమగాధ, అందాల రాక్షసి, లై లాంటి యూత్ ఫుల్ లవ్ స్టోరీస్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న హను రాఘవపూడి రొమాంటిక్ ఎంటర్‌ టైనర్‌గా 'పడి పడి లేచె మనసు' చిత్రాన్ని రూపొందించారు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేయగలడన్న పేరు సంపాదించిన శర్వానంద్.. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఫిదా చేయడమే అలవాటు చేసుకున్న క్రేజీ హీరోయిన్ సాయిపల్లవి.. ఈ ఇద్దరూ రొమాంటిక్ ప్రేమకథా చిత్రంలో జోడీ కట్టడంతో తొలి నుండి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది? శర్వానంద్‌, సాయి పల్లవిల జంట ఏ మేరకు ఆకట్టుకుంది.? అనే విషయాలు తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

కథ:
కోల్‌కతాలో ఫుట్‌బాల్ ప్లేయర్ అయిన సూర్య(శర్వానంద్) అనుకోకుండా హీరోయిన్ వైశాలి (సాయిపల్లవి)ని తొలిచూపులోనే చూసి ప్రేమలో పడిపోతాడు. అంతేకాదు వైశాలి ప్రేమను దక్కించుకోవడానికి చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చివరకు ఆమె తనను ప్రేమించేలా చేస్తాడు. తీరా పెళ్లి దగ్గరకు వచ్చేసరికి ఆ ప్రపోజల్‌ను కాదంటాడు. జీవింతాంతం వివాహం చేసుకోకుండా ప్రేమించుకుందామనే ప్రపోజల్ పెడతాడు సూర్య(శర్వానంద్). దీనికి వైశాలి (సాయి పల్లవి) ఓకే చెప్పిందా లేదా అనేదే ఈ స్టోరీ. ఆ తర్వాత వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారా? లేదా? అనేది తెరపై చూడాల్సిందే.

నటన:
కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన పలు తెలుగు చిత్రాలు విజయాన్ని సాధించాయి. తాజాగా దర్శకుడు హను రాఘవపూడి అదే తరహాలో ప్రేమ, లివింగ్ రిలేషన్‌షిప్ నేపథ్యంలో రొమాంటిక్ ప్రేమకథను చెప్పే ప్రయత్నం చేశారు. ప్రేమికులుగా ఉన్నప్పుడే అసలైన లవ్ ఉంటుందని.. పెళ్లి అయితే ప్రేమ ఉండదనే కాన్సెప్ట్‌లో గతంలో రామ్ చరణ్ 'ఆరంజ్' చిత్రంతో ఇదే తరహా మెసేజ్ ఇచ్చారు. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు పెద్దగా రుచించలేదు. మళ్లీ అదే కాన్సెప్ట్‌కు 'పడి పడి లేచె మనసు' అంటూ రంగులు అద్దారు హను రాఘవపూడి. అయితే ఈ కథలో భూకంపం, మతిమరుపు లాంటి ఎలిమెంట్స్‌ని భారంగా ఇరికించేశాడు దర్శకుడు.

నటన పరంగా శర్వానంద్, సాయి పల్లవిలు పోటీ పడి చేశారు. భావోద్వేగాల్లో తనకు తానే సాటి అనేలా చేసింది. ఎమోషన్స్ సీన్స్‌లో జీవించేసింది. శర్వానంద్, సాయి పల్లవిల మధ్య రొమాన్స్ బాగానే వర్కౌట్ అయ్యింది. అయితే ఇద్దరూ విడిపోవడానికి బలమైన కారణం చూపించకపోవడం.. తిరిగి కలుసుకోవడానికి ఇద్దరూ మళ్లీ ప్రేమలో పడటం.. భూకంపం, హీరోయిన్‌కి మెమొరీ లాస్ లాంటివి ప్రేక్షకుల్ని గందరగోళానికి గురి చేశాయి.

టెక్నీషియన్స్:

ఫస్టాఫ్ మొత్తం సాఫీగా సాగిపోయిన ఈ ప్రేమకథ.. సెకండాఫ్‌లో లేనిపోని ట్విస్ట్‌లు ఇబ్బందిగా అనిపిస్తాయి. తొలిభాగం ఇంట్రస్టింగ్‌గా ఉన్నప్పటికీ ద్వితీయార్ధంలో కథను ముందుకు తీసుకువెళ్లడంతో దర్శకుడు ఇబ్బంది పడ్డాడు. ఏం జరగబోతుందో ముందే తెలిసిపోవడంతో జరిగిన కథనే మళ్లీ చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. కామెడీ పరంగా ప్రియదర్శి, సునీల్‌, వెన్నెల కిశోర్‌ లాంటి వాళ్లు ఉన్నా.. సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. సెకండాఫ్‌లో సునీల్ వచ్చినా ఆయన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. మురళి శర్మ, ప్రియా రామన్‌, సంపత్‌లు పరిధి మేర బాగానే నటించారు.

టెక్నికల్ పరంగా సినిమా చాలా రిచ్‌గా ఉంది. కోల్‌కతా, నేపాల్, ఖాట్మండ్‌లలోని అందమైన లోకేషన్లను సినిమాటోగ్రాఫర్ జే కే అద్భుతంగా చూపించారు. విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్:
శర్వానంద్, సాయి పల్లవిల నటన
మ్యూజిక్
ఫోటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:
రొటీన్ స్టోరీ
అక్కడక్కడ సాగదీసే సన్నివేశాలు
కామెడీ

రేటింగ్: 2.5/5

Next Story
Share it