Top
Sneha TV

కూల్‌గా చై, శామ్‌ల మజిలీ ఫస్ట్ లుక్

X

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా, నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ డైరెక్షన్‌లో, సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న సినిమాకి, ముందునుండీ ప్రచారంలో ఉన్న మజిలీ పేరునే టైటిల్‌గా ఫిక్స్ చేస్తూ, ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు మేకర్స్. దేర్ లవ్, దేర్ ఈజ్ పెయిన్ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. ఇంతకుముందు చైతు బర్త్‌డే సందర్భంగా, వెస్పాపై కూర్చుని కూల్‌గా నవ్వుతున్న లుక్ రిలీజ్ చేసిన చిత్ర బృందం, ఇప్పుడు చై, శామ్ కలిసి ఉన్న పోస్టర్ విడుదల చేసింది. ఈ లుక్‌లో చైతు, సమంత ఒకరినొకరు పట్టుకుని, కళ్ళు మూసుకుని మరీ ప్రేమలోని మాధుర్యాన్ని రుచి చూస్తున్నట్టున్నారు.


మజిలీలో చైతు మాజీక్రికెటర్‌గా కనిపించనున్నాడు. బ్యాక్ గ్రౌండ్‌లో వాల్తేరు గ్రౌండ్, విశాఖపట్నం బోర్డ్ కనిపిస్తుంది. సమంత రైల్వే క్లర్క్‌గా కనిపించబోతుంది. కథ ప్రకారం చీటికీ మాటికీ గొడవపడే భార్య, భర్తలుగా చై, శామ్ నటిస్తున్నారని తెలుస్తుంది. దివ్యాంశ కౌశిక్ సెకండ్ హీరోయిన్‌గా చేస్తుంది. ఆఫ్టర్ మ్యారేజ్, చైతు, సమంత కలిసి నటిస్తున్న సినిమా కావడంతో మజిలీపై మంచి అంచనాలున్నాయి.

గోపి సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. యుద్ధం శరణం, శైలజారెడ్డి అల్లుడు, సవ్యసాచి సినిమాలతో నిరాశపడ్డ చైతు,
ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. తనికెళ్ళ భరణి, రావు రమేష్, పోసాని, సుబ్బరాజు తదితరులు నటిస్తున్నారు. 2019 ఏప్రిల్‌లో మజిలీని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

Next Story
Share it