Top
Sneha TV

'యమన్' గా ఆకట్టుకున్న బిచ్చగాడు ....

X

విజయ్‌ ఆంటోని హీరోగా మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్‌, లైకా ప్రొడక్షన్స్‌ పతాకాలపై జీవ శంకర్‌ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించిన 'యమన్‌' మహా శివరాత్రి సందర్భంగా ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. బిచ్చగాడు తర్వాత విజయ్‌ ఆంటోని హీరోగా నటించిన ఈ చిత్రం, ఇప్పటివరకు అయన చేసిన సినిమాలన్నింటిలోనూ ఇదో డిఫరెంట్‌ మూవీ అని చెప్పొచ్చు. కంప్లీట్‌ ఔట్‌ అండ్‌ ఔట్‌ పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కింది.

కొందరు వ్యక్తుల మధ్య జరిగే ఈ పొలిటికల్ గేమ్ అనే అంశం చాలా ఆసక్తికరంగా ఉంది. సినిమాలో విజయ్ ఆంటోనీ తనకు ఎదురైన కష్టమైన పరిస్థితులను ఎలా ఎదుర్కున్నాడు, ఎలాంటి మైండ్ గేమ్ ఆడాడు, అనుకున్నది ఎలా సాధించాడు అనే అంశాలు ప్రేక్షకులకు మంచి ఆసక్తి కలిగిస్తాయి.

ప్రతి ఒక్కరికి నచ్చే అంశాలు ఇందులో నిండుగా ఉన్నాయి. ఓవరాల్ గా మరోసారి యమన్ గా విజయ్ ఆకట్టుకున్నాడు.

విజయ్‌ ఆంటోని, మియా జార్జ్‌, త్యాగరాజన్‌, సంగిలి మురుగన్‌, చార్లీ, స్వామినాథన్‌, మారిముత్తు, జయకుమార్‌, అరుల్‌ డి. శంకర్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈచిత్రానికి సంగీతం: విజయ్‌ ఆంటోని, ఎడిటింగ్‌: వీరసెంథిల్‌ రాజ్‌, మాటలు: భాష్యశ్రీ, ఫైట్స్‌: దిలీప్‌ సుబ్బరాయన్‌, సమర్పణ: మిర్యాల సత్యనారాయణరెడ్డి, నిర్మాతలు: మిర్యాల రవిందర్‌రెడ్డి, లైకా ప్రొడక్షన్స్‌, కథ, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం: జీవశంకర్‌.

Next Story
Share it