Top
Sneha TV

'దువ్వాడ జగన్నాథమ్‌' టీజర్‌ వచ్చేసింది ...!

X

బన్నీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. 'సరైనోడు' వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత బన్నీ చేస్తున్న చిత్రం 'డీజే.. దువ్వాగ జగన్నాథమ్'. మహాశివరాత్రి కానుకగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. ఈ సినిమాలో బన్నీ బ్రాహ్మణుడి పాత్ర చేస్తున్నాడు. టీజర్‌లో బన్నీ చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. హీరోయిన్ పూజా హెగ్దే దీనికి మరింత అందాన్ని తెచ్చిందంటున్నారు సినీ జనాలు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ టీజర్ చూసేయండి. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్టైలిష్ డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇందులో బన్నీ సరసన పూజా హెగ్దే నటిస్తోండగా, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Next Story
Share it