Top
Sneha TV

రేపే బాహుబలి స్పెషల్ షో ...

X

తెలుగు సినిమా కీర్తి ప్రతిష్టలని దశ దిశలా వ్యాపించేలా చేసిన చిత్రం బాహుబలి ది బిగినింగ్. పలు భాషలలో విడుదలయిన ఈ చిత్రం అనేక రికార్డులు క్రియేట్ చేసింది. రాజమౌళి ఈ చిత్రాన్ని విజువల్ వండర్ గా తెరకెక్కించగా ఇందులోని సన్నివేశాలు ఆడియన్స్ ని సీట్లకు అతుక్కునేలా చేశాయి. రెండో పార్ట్ మరి కొద్ది రోజుల్లో విడుదల అవుతున్నప్పటికి తొలి పార్ట్ పై అభిమానుల్లో ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో గల సంధ్య 70 ఎంఎం థియేటర్ లో శివరాత్రి నాడు బాహుబలి ది బిగినింగ్ చిత్రాన్ని సెకండ్ షోకి ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారట. ఈ వార్త తెలుసుకున్న అభిమానులు ఇప్పటికే ఈ షోకి టిక్కెట్స్ బుక్ చేసుకున్నారని సమాచారం.

గ్రాఫికల్ విజువల్స్ తో అత్యద్బుతంగా ఉన్న ఈ చిత్రం థియేటర్ లో మంచి అనూభూతని ఇస్తుందని భావించిన అభిమానులు ఈ స్పెషల్ షో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట. బాహుబలి 2 చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుండగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 28న భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Next Story
Share it