Top
Sneha TV

ఆ ట్రైలర్ లో అన్ని ముద్దులే ... లిప్ లాక్ ల తో పిచ్చెక్కిస్తున్న హెబ్బా ...!

X

24 కిస్సెస్ సినిమా లో హెబ్బా పటేల్ రెచ్చిపోయింద ని చెప్పాల్సిందే. యంగ్ బ్యూటీ హెబ్బా పటేల్ కుమారి 21 ఎఫ్ చిత్రంతో టాలీవుడ్ లో సంచలనంగా మారిపోయింది. యువతలో ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ తరువాత కొన్ని హిట్స్ పడ్డాయి. చిన్న చిత్రాలతో హెబ్బా జోరు పెంచింది. మధ్యలో పరాజయాలు కూడా ఎదురవడంతో స్టార్ హీరోయిన్ కాలేక పోయింది. బోల్డ్ రోల్స్ కు తాను వెనుకాడనని తన చిత్రాల ద్వారా ఈ భామ చెబుతూనే ఉంది.

టైటిల్ తోనే యువతని ఆకర్షించేలా ఉన్న ఈ చిత్రంలో హెబ్బా, యువ నటుడు ఆదిత్ జంటగా నటిస్తున్నారు. కొద్ది సేపటి క్రితమే ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది.ట్రైలర్ చూస్తుంటే 24 కిస్సెస్ చిత్రాన్ని లవ్ అండ్ రొమాంటిక్ అంశాలతో రూపొందించినట్లు తెలుస్తోంది. ఆదిత్, హెబ్బా పటేల్ మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. ఈ చిత్రంలో సీనియర్ నటుడు రావు రమేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.ట్రైలర్ లో ఆదిత్, హెబ్బా పటేల్ మధ్య ఘాటు లిప్ సన్నివేశాల్ని చూపించారు.ఇద్దరూ రెచ్చిపోయి నటించారు. యువతని ఆకర్షించేలా రొమాంటిక్ సీన్స్ రూపొందించినట్లు తెలుస్తోంది.హీరో, హీరోయిన్ ప్రేమ కథలో ఎమోషనల్ అంశాలు కూడా ఉన్నాయి. ఏదో కారణం వలన ఇద్దరూ విడిపోయే సన్నివేశాలని చాలా ఎమోషనల్ గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. హీరో ప్రేమ కథ ఎలా మొదలైంది. లీడ్ మధ్యలో వచ్చిన ఆ లేడి ఎవరు వంటి ఆసక్తికర అంశాలతో ట్రైలర్ రూపొందించారు

Next Story
Share it