Top
Sneha TV

వైరల్ : వెంకీ లుంగీ పిక్

X

వెంకటేష్ , వరుణ్ తేజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ' ఎఫ్ 2 '. పటాస్ , రాజా ది గ్రేట్ వంటి వరుస హిట్లతో దూసుకెళ్తున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ చిత్రం ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ ఫారిన్‌లో జరుగుతోంది. కాగా ఈ చిత్రంలో వెంకటేశ్‌కు సంబంధించిన ఓ లుక్ బయటికి వచ్చింది. అందులో పైన షూటు, కింద లుంగీతో వెంకటేశ్ ఆహార్యం అందరినీ నవ్వించేలా ఉంది. ఇక ఇదే ఫొటోలో ఇద్దరు ఫారిన్ గర్ల్స్ ఉండగా.. వారు కూడా మాస్ అవతారంలో ఆకట్టుకుంటున్నారు. ప్రస్థుఆత్మ్ ఈ పిక్ సోషల్ మీడియా లో వైరల్ గా చక్కర్లు కొడుతుంది. వెంకీ అభిమానులైతే ఈ పిక్ ను తెగ షేర్ చేస్తూ కామెంట్స్ విసురుతున్నారు.

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈచిత్రంలో వెంకీ సరసన తమన్నా నటిస్తుండగా వరుణ్ కు జోడిగా మెహ్రీన్ నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం ఫై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నఈచిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకానుంది.

ఇక కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాదిలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story
Share it