Top
Sneha TV

36 ఏళ్ల తర్వాత చిరు చిత్రంలో..?

X

హైదరాబాద్‌: దాదాపు 28 ఏళ్ల విరామం తర్వాత 2017లో వచ్చిన 'ఫిదా' చిత్రంలో నటించారు ప్రముఖ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ సాయి చంద్‌. ఇందులో కథానాయిక సాయి పల్లవికి తండ్రిగా కనిపించారు. ఇప్పుడు మెగాస్టార్‌ చిరంజీవి టైటిల్‌ పాత్రలో నటిస్తున్న 'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అదే నిజమైతే దాదాపు 36 ఏళ్ల తర్వాత సాయిచంద్‌.. చిరు చిత్రంలో నటించినట్లు అవుతుంది.

1982లో వచ్చిన 'మంచు పల్లకి' చిత్రంలో చిరంజీవి, సాయిచంద్‌ నటించారు. 'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో చిరుకు సన్నిహితుడి పాత్రలో కన్పిస్తారని తెలుస్తోంది. ఇటీవల వీరిద్దరి నేపథ్యంలో పలు సన్నివేశాలను కూడా తెరకెక్కించినట్లు సమాచారం. 'సైరా' చిత్రానికి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఇందులో చిరుకు జోడీగా నయనతార నటిస్తున్నారు. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, జగపతిబాబు, సుదీప్‌, విజయ్‌ సేతుపతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై రామ్‌చరణ్‌ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు

Next Story
Share it