Top
Sneha TV

సైరా లో నిహారిక ఏ పాత్రలో కనిపిస్తుందో తెలుసా..?

X

మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక..ఒక మనసు మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ మూవీ ఆశించిన విజయం సాదించిక పోవడం తో రెండో మూవీ విషయం లో కాస్త ఆలోచనలో పడింది. ప్రస్తుతం ఈమె పెదనాన్న చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహ రెడ్డి లో నటించబోతుందనే వార్తలు ఫిలిం సర్కిల్లో వినిపిస్తున్నాయి.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథగా తెరకెక్కుతున్న సినిమాలో నిహారిక ఒక కథకళి డ్యాన్సర్ పాత్రలో కనిపిస్తుందట. ఈ పాత్రను సమర్థవంతంగా పోషించేందుకు ఇప్పుడు కథకళి ట్రైనింగ్ తీసుకుంటోందట. సినిమాలో నిహారిక స్క్రీన్ టైమ్ పది నిముషాలే కానీ కథలో మాత్రం నిహారిక పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని అంటున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా హైదరాబాద్ లో జరుగుతుంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కు సైతం అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ - విజయ్ సేతుపతి - సుదీప్ లతో పాటు నయనతార - తమన్నా లు కూడా నటిస్తున్నారు. ఇక ప్రకాష్ రాజ్ - నాజర్ లాంటి టాలెంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం.

Next Story
Share it