Sneha TV
ముచ్చట

కడ్రాయరే వేసుకోను... మాస్కు ధరించాలా..!

X

"కరోనానా దాని జేజమ్మనా... ఏది వచ్చినా నేను మాస్కు ధరించను... కడ్రాయరే వేసుకోను... అలాంటిది నాకు మాస్కు ధరించమని ఇబ్బంది పెడతారా.. మనుషులు శ్వాస తీసుకునే అధికారాన్ని హరించే హక్కను మీకు ఎవరిచ్చారు.. ఎక్కడ పొందారు". అంటూ ఓ వ్యక్తి మాస్కుల ధరింపును వ్యతిరేకిస్తూ ప్రచారం చేస్తున్నాడు. అంతేకాదు మాస్కుల ధరింపును బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో బీచ్‌ కౌంటీ కమిటీ పేరుతో వైద్యులు, వైద్య నిపుణులు ఏర్పాటు చేసిన సమావేశంలో మాస్కులను ధరించకుండా ఉండేందుకు అనేక కారణాలను లేవనెత్తారు. అంతేకాదు మాస్కును ధరించాలని బలవంతపెడుతూ..మానవ హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాధికారులు, వైద్యులు, వైద్య నిపుణులపై కేసులు పెట్టి అరెస్టు చేస్తామని ప్రచారకులు పేర్కొంటున్నారు. అయితే మాస్కులను ధరించడం వల్ల ప్రాణాలకు హాని కలుగుతుందని యాంటీ మాస్క్‌ ప్రచారకులు భావిస్తున్నప్పటికీ ఇది వాస్తవానికి పూర్తి విరుద్ధమని నిపుణులు పేర్కొంటున్నారు.

మరోవైపు అమెరికా దేశవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపు 25 లక్షలకుపైగా కేసులు నమోదవ్వగా వైరస్‌ తో 1,26,000 మంది మృత్యువాతపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు కోటి మందికి కరోనా కబళించింది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కుదుపుతున్న వేళలో ముఖానికి మాస్కులు ధరించడం అత్యంత ఆవశ్యకంగా మారిన సమయంలో ఇలాంటి దుష్ప్రచారాలను ఆపి కరోనా నివారణకు బాధ్యతగల పౌరులుగా వ్యవహరించాల్సిన తీరును ప్రతిఒక్కరూ గుర్తించాలి. - జోనా బి రామారావు., స్నేహ ఇంటర్నెట్‌ డెస్క్.

Next Story
Share it