Sneha TV
న్యూస్

బీజేపీ బైఠక్!

X

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండు జాతీయ పార్టీలు ఒకదానిని మరొకటి దెబ్బకొట్టే స్థితి కనిపించడం లేదు. ఏ ఒక్క పార్టీ సొంతంగా అధికారం చేపట్టలేదనేది స్పష్టంగా కనబడుతున్నది. దేశమంతటా పరుచుకొని ఉన్న ప్రాంతీయ పార్టీలు నిర్ణయాత్మక శక్తిగా అవతరిస్తాయి. అందువల్ల రెండు జాతీయపార్టీలు వాస్తవిక దృక్పథంతో ఆలోచించాలె. ప్రాంతీయ పార్టీల అవసరాన్ని గుర్తించి సత్సంబంధాలు నెలకొల్పుకోవడమే రాజనీతిజ్ఞత. దేశమంతటా ఎన్నికల వేడి రగులుకుంటున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు శని, ఆదివారాల్లో జరుగడం ప్రాధాన్యం సంతరించుకున్నది. పార్టీ అంతర్గత చర్చల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించబోయే వ్యూహం గురించి ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తున్నది. వచ్చే లోక్‌సభ ఎన్నికల గురించి కూడా చర్చకు వచ్చిందని చెబుతున్నారు. పార్టీ ఆంతరంగిక ఎన్నికలను వాయిదా వేసి అధ్యక్షుడిగా అమిత్ షా పదవీకాలాన్ని పొడిగించడానికి నిర్ణయించినట్టు కూడా తెలుస్తున్నది. ప్రధాని మోదీ, అమిత్ షా ద్వయం పార్టీని లోక్‌సభ ఎన్నికల్లో నడిపించబోతున్నదనడంలో సందేహం లేదు. మొదటిరోజు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, రెండవ రోజు ప్రధాని మోదీ ప్రసంగాలు గమనిస్తే ఈ అగ్రనాయకత్వానికి మళ్ళా పార్టీని విజయపథంలో నడిపించగలమనే ధీమా కనబడుతున్నది.

గుజరాత్‌లో 31 ఏండ్లు అధికారంలో ఉన్నాం. అధికార కాంక్ష లేదు కనుకనే అధికారంలో ఉండగలిగాం. అధికారం కావాలనుకునేది గద్దెమీద కూర్చోవడానికి, ప్రజలకు సేవ చేయడానికి. అజేయ భారత్, అటల్ (స్థిరమైన) భాజపా స్ఫూర్తితో తాము దేశాభివృద్ధి కోసం కృషిచేస్తామని మోదీ కార్యవర్గ సమావేశంలో అన్నారు.

మోదీ నాయకత్వంపై పూర్తి విశ్వా సం ఉన్నట్టు ఇతర నాయకుల మాటలను బట్టి తెలిసిపోతున్నది. మోదీ జనాకర్షణ 2019 ఎన్నికల్లో పార్టీ గెలుపునకు దారితీస్తుందని అమిత్ షా స్పష్టంగా చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రజలు మోదీకి దృఢంగా మద్దతు ఇస్తున్నారని అమిత్ షా పార్టీ సమావేశంలో చెప్పినట్టు ఆ తర్వాత రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్, ఇతర మంత్రు లు, గుజరాత్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు మొదలైనవారంతా మోదీని ప్రస్తుతించడం గమనార్హం.

వచ్చే ఎన్నికల్లో బీజేపీకి సొంత బలం సంగతెట్లా ఉన్నా కాంగ్రెస్ పార్టీ అత్యంత బలహీనం గా ఉండటం బాగా కలిసొచ్చే అంశం. కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రధానమైన లోపం రాహుల్ గాం ధీ నాయకత్వం. బీజేపీ సొంతంగా, ఇతర పార్టీలతో కలిసి 19 రాష్ర్టాల్లో అధికారంలో ఉంటే, కాంగ్రెస్ పంజాబ్‌తోపాటు మిజోరం వంటి చిన్న రాష్ట్రంలో మాత్రమే సొంతంగా అధికారంలో ఉన్నది. కర్ణాటకలో జేడీఎస్‌తో కలిసి బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకున్నది.

అయినప్పటికీ బీజేపీ అగ్ర నాయకత్వం తమ విమర్శలను కాంగ్రెస్‌పైనే ఎక్కుపెట్టడం గమనా ర్హం. బీజేపీ నాయకత్వం మహాఘట్‌బంధన్ ను, ప్రతిపక్షాలను విమర్శిస్తూనే కాంగ్రెస్‌పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. త్వరలో మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముఖాముఖి ఎదుర్కొనేది కాంగ్రెస్ పార్టీనే. లోక్‌సభ ఎన్నికలకు కొంచెం ముందుగా వస్తున్న ఈ మూడు అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నది.

ఈ మూడు రాష్ర్టాల్లోనే కాకుండా, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఉనికి కాదనలేనిది. ఎంత బలహీనమైనదైనా, పార్లమెంట్‌లో ప్రతిపక్ష హోదాకు తగినన్ని సీట్లు లేకపోయినా జాతీయ పార్టీ గా ఎదురునిలిచి ఉన్నది కాంగ్రెస్ పార్టీయే. ప్రతిపక్షాలను పోగు చేసుకొని సవాలు విసురుతున్నది. భారత్ బంద్ పిలుపు ఇచ్చి ప్రతిపక్షాలకు కేంద్ర బిందువుగా మారడానికి ప్రయత్నిస్తున్న ది.

అందువల్ల భవిష్యత్తులో కాంగ్రెస్‌ను బలహీనపరచడాన్ని బీజేపీ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటుంది. ఎన్నికల సమరంలో పాల్గొనే నాయకులకు ధీమా అవసరమే. కానీ ఆత్మవిశ్వాసంతో పాటు ఆత్మ పరిశీలన కూడా అవసరం. ప్రధాన ప్రతిపక్ష బలహీనత ఆధారంగానే గెలుస్తామనుకోవడం బలహీనత అవుతుందే తప్ప బలం కాదు.

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే లేదు. వివిధ రాష్ర్టాల్లో అనేక ప్రాంతీయ పార్టీలున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ ముఖాముఖి తలపడే రాష్ర్టాలు మరీ ఎక్కువేమీ లేవు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లతోపాటు గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా రాష్ర్టాల్లో బీజేపీ, కాంగ్రెస్ ఎదురెదురుగా ఢీకొంటున్నాయి.

ఈ ఏడు రాష్ర్టాల్లో ఉన్నది 110 సీట్లు మాత్రమే. వీటిలో గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 104 గెలుచుకున్నది. అంటే కాంగ్రెస్ బలహీనతపై ఆధారపడి లబ్ధి పొందే సీట్లు ఎక్కువగా లేవు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బొటాబొటిగా గెలిచినప్పటికీ, తీవ్రమైన వ్యతిరేక తను అధిగమించ వలసి వచ్చింది.

ఇదే రాష్ట్రంలో లోక్‌సభలో ఇదేరకమైన ఫలితాలుంటాయని చెప్పలేము. ఈ ఏడు రాష్ర్టాల్లో బీజేపీ మళ్ళా 104 సీట్లు తెచ్చుకోగలదని చెప్పగలిగే పరిస్థితి లేదు. బీజేపీ వ్యతిరేకతను ఉపయోగించుకొని కాంగ్రెస్ అన్ని సీట్లు ఊడ్చిపెట్టుక పోతుందని చెప్పలేం. కానీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండు జాతీయ పార్టీలు ఒకదానిని మరొకటి దెబ్బకొట్టే స్థితి కనిపించడం లేదు.

ఏ ఒక్క పార్టీ సొంతంగా అధికారం చేపట్టలేదనేది స్పష్టంగా కనబడుతున్నది. దేశమంత టా పరుచుకొని ఉన్న ప్రాంతీయ పార్టీలు నిర్ణయాత్మక శక్తిగా అవతరిస్తాయి. అందువల్ల రెండు జాతీయపార్టీలు వాస్తవిక దృక్పథంతో ఆలోచించాలె. ప్రాంతీయ పార్టీల అవసరాన్ని గుర్తించి సత్సంబంధాలు నెలకొల్పుకోవడమే రాజనీతిజ్ఞత.

Next Story
Share it