Top
Sneha TV

ఆరోగ్యశ్రీలో నూతన శకం..

ఆరోగ్యశ్రీలో నూతన శకం..
X

ఆరోగ్యశ్రీలో మరో నూతన శకానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇవాల్టి నుంచి మరో ఆరు జిల్లాలకు ఆరోగ్యశ్రీ విస్తరణ సేవలను ప్రారంభించారు. వైద్య ఖర్చులు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా ఆరోగ్యశ్రీలో పలు మార్పులు చేసి తొలుత పైలట్‌ ప్రాజెక్టుగా దీన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో జనవరి 3 నుంచి అమలు చేస్తున్నారు. తాజాగా విజయనగరం, విశాఖ, గుంటూరు, ప్రకాశం, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో అమల్లోకి తీసుకు రానున్నారు.

ఆరోగ్యశ్రీ పరిధిని విస్తృతంగా పెంచుతున్నామని సీఎం జగన్ తెలిపారు. ఐదు లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారికి ఆరోగ్య శ్రీ వర్తింపు చేస్తామని తెలిపారు. ఆస్పత్రులకు గ్రేడింగ్‌ విధానం అమలు చేస్తామని పేర్కొన్నారు. ‘‘ కరోనాను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చిన ఏకైక రాష్ట్రం ఏపీ. వైద్యం కోసం ఎవరూ అప్పులు పాలు కాకూడదు. కోటి 42 లక్షల మందికి ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చాం. నాడు-నేడుతో ఆస్పత్రుల రూపు రేఖలు మారుస్తామని సీఎం జగన్‌ తెలిపారు.

Next Story
Share it