Top
Sneha TV

హైవే రోడ్డు పనుల సర్వేను అడ్డుకున్న రైతులు..

హైవే రోడ్డు పనుల సర్వేను అడ్డుకున్న రైతులు..
X

ఖమ్మం జిల్లా మధిరలో రైతులు ఆందోళన చేపట్టారు. చింతకాని మండలం బస్వాపురం గ్రామ పొలిమేరలో హైవే రోడ్డు సర్వే పనులను రైతులు అడ్డుకున్నారు. రహదారుల పేరుతో పంట పొలాలను ధ్వంసం చేస్తున్నారని రైతులు ఆరోపించారు. నేషనల్ హైవే కోసం గ్రీన్‌ ఫీల్డ్‌లో భాగంగా కొందరు అధికారులు సర్వే చేస్తుండగా..పలు గ్రామాల రైతులు సర్వేను అడ్డుకోవటం వలన అధికారులకు రైతుల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున ఘటన స్థలానికి చేరుకొన్నారు. ఏమీచేసేది లేక సర్వే పనులను అధికారులు తాత్కాలికంగా వాయిదా వేశారు.

Next Story
Share it