Top
Sneha TV

'దాడికి పాల్పడిన కార్పొరేటర్ ను అరెస్టు చేయాలి'

దాడికి పాల్పడిన కార్పొరేటర్ ను అరెస్టు చేయాలి
X

బోడుప్పల్‌ మున్సిపాల్ కార్పొరేషన్‌లో టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అంజలి గౌడ్ భర్త శ్రీధర్ గౌడ్‌, అనుచరులు కలిసి చేసిన దాడిలో గాయపడ్డ పూరేందర్ రెడ్డిని వారి కుటుంబ సభ్యులను.. సంక్షేమ సంఘాల సమాఖ్య ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు పరామర్శించారు. కార్పొరేషన్‌ పరిధిలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం విచారకరమని, భూవివాదంలో సమస్యలుంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలే తప్ప ఇలాంటి దాడులకు పాల్పడటం దారుణమన్నారు. సంఘటనలో మొదటి ముద్దాయి అయిన శ్రీధర్ గౌడ్, తన అనుచరులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Next Story
Share it