Top
Sneha TV

కులదరహంకారం: గ్రామంలో దళితుడు ప్రవేశించాడని.. కాళ్లు ఇరగ్గొట్టేశారు...

కులదరహంకారం: గ్రామంలో దళితుడు ప్రవేశించాడని.. కాళ్లు ఇరగ్గొట్టేశారు...
X

కడపజిల్లా, చిన్నమండెం మండలం దిగువఒట్టివీడు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామంలోని దళిత జాతికి చెందిన నక్కా ఆంజనేయులు తన అవసరం మేరకు మండలంలోని చాకిబండ గ్రామం రెడ్డివారిపల్లికి వెళ్లాడు. ఓ అంటరాని కులం వారు తమ గ్రామానికి రాకుడదని అగ్రకులస్తులైన రాజారెడ్డి, బ్రహ్మానందరెడ్డి, వెంకటరాయుడు కలిసి ఆంజనేయులును హెచ్చరించారు.

మరోసారి తప్పని పరిస్థితుల్లో ఆంజనేయులు అదేగ్రామానికి వెళ్లాల్సి వచ్చింది. దీనిని తెలుసుకున్న అగ్రకులస్థులు పథకం ప్రకారం ట్రాక్టర్‌తో ఆంజనేయులుపై దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితుడు కుడికాళ్లు విరిగిపోవటంతో అతని కుటుంబం రోడ్డున పడింది. ఈ విషయంపై దళిత సంఘాలు తీవ్ర అగ్రహాం వ్యక్తం చేస్తూ.. నిందితులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసును నమోదు చేయాలని డిమాండ్‌ చేశాయి.

Next Story
Share it