Top
Sneha TV

ఆదరణ అనాధాశ్రమం సందర్శించిన ఎమ్మెల్యే సీతక్క

X

హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లోని ఆదరణ స్వచ్ఛంద సంస్థ అనాధ పిల్లలకు బాసటగా నిలుస్తుండడం అభినందనీయమని ముగులు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. సరూర్‌నగర్‌లోని ఆదరణ హోంలో తల్లిదండ్రులు లేని చిన్నారులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠశాలతో వసతి గృహాన్ని నిర్వహిస్తున్న ఆదరణ హోం వ్యవస్థాపకులు జాడి మాధవ రావు కృషి పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. పేద, అనాథ పిల్లలను ఆదుకునేందుకు జాడి మాధవ రావును ఆదర్శంగా తీసుకొని మరిన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు.

పేదల పిల్లలను ఆదుకునేందుకు తన వంతు సహాయ, సహకారాలు అందిస్తానని హోం నిర్వాహకులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్కను ఆదరణ హోం ఛైర్మన్‌ జాడి మాధవరావు, ఉస్మానియా ప్రొఫెసర్‌ జాడి ముసలయ్య, జాడి కోటేశ్వర్‌ రావులు సన్మానించారు.

Next Story
Share it