Top
Sneha TV

రాజగృహపై దాడిని ఖండిస్తూ దళిత సంఘాల రాల్యీ

రాజగృహపై దాడిని ఖండిస్తూ దళిత సంఘాల రాల్యీ
X

ముంబయి లో డా .బి.ఆర్. అంబేద్కర్ రాజగృహ పై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలంటూ గుంటూరు జిల్లా పొన్నూరులో దళిత సంఘాలు రాల్యీ నిర్వహించారు. అనంతరం స్థానిక ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ, మాల మహానాడు ఇండియన్ లేబర్ పార్టీ అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో పొన్నూరు ఐల్యాండ్ సెంటర్ వద్ద క్యాండిల్స్‌ వెలిగించి నిరసన వ్యక్తం చేశారు. రాజగృహ పై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం లీగ్ పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్ సుభాని, మహమ్మద్ ఖాసిం, రాష్ట్ర కార్యదర్శి మౌలానా అల్తాఫ్ మురాది, మాలమహానాడు నాయకులు కటికల గాంధీ, చైతన్య, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story
Share it