Sneha TV
న్యూస్

సెప్టెంబర్ వరకూ ఉజ్జ్వాల పథకం కింద గ్యాస్ సిలెండర్లు

సెప్టెంబర్ వరకూ ఉజ్జ్వాల పథకం కింద గ్యాస్ సిలెండర్లు
X

కరోనా కష్టకాలంలో పేదలు, రైతులు, వలస కార్మికులతో సహా ఇతర వర్గాలను ఆదుకోవడం కోసం కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటుంది. కొద్ది రోజుల క్రితం పిఎం మోడీ గరీబ్‌ కల్యాణ్‌ ఆయోజనను నవంబర్‌ వరకు పొడిగించాలని ప్రకటించిన కేంద్రం ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది. దేశంలోని కోట్ల కుటుంబాలకు పెద్ద ఉపశమనం ఇచ్చింది. ఈపీఎఫ్‌, జిఐసి, ఉజ్వల పథకంలో పెద్ద మార్పులు చేసింది. వచ్చే మూడు నెలలపాటు ఏటు కోట్లకుపైగా ఉజ్వాలా పథకం కింద సిలిండర్లు పొందిన వారు సెప్టెంబర్‌ వరకు ఉచిత ఎల్‌పీజీ సిలిండర్లను పొందుతారు. సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. '' ఉజ్జ్వాలా పథకం కింద గ్యాస్‌ సిలిండర్లు తీసుకునే 7కోట్ల 40లక్షల మంది మహిళలకు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకలించారు."

Next Story
Share it