Sneha TV
న్యూస్

కరోనా శ్వాస మీదే కాదు... నరాల మీదా దాడి చేస్తోంది: డాక్టర్ మోహన్ వి సుమేధ వెల్లడి

కరోనా శ్వాస మీదే కాదు... నరాల మీదా దాడి చేస్తోంది: డాక్టర్ మోహన్ వి సుమేధ వెల్లడి
X

ప్రస్తుత అన్ లాక్ కారణంగా, కోవిడ్ 19 రో జురోజుకు మరింత బలపడుతూ తన జన్యు మ్యాప్ ను మార్చుకుంటుందని ప్రముఖ వైద్యులు చెప్తున్నారు. ఇప్పటి వరకు ఈ వైరస్ వ్యాప్తిపై పలు అభిప్రాయాలు వింటున్నాం. కోవిడ్ 19 ప్రపంచమంతా విస్తరించడం మొదలై సంవత్సరం కావస్తున్నా వ్యాక్సిన్ కనుక్కోలేక పోవడానికి యిది కూడా ఒక కారణంగా వైద్యులు చెబుతున్నారు.
కాగా, విశాఖపట్నం మెడికవర్ హాస్పిటల్స్ న్యూరాలజిస్ట్ కన్సల్టెంట్, డాక్టర్ మోహన్ వి సుమేధ మాటూరు, ఈ పాండమిక్ గురించి మరింత సమాచారం తెలియజేశారు. ఇప్పటి వరకు ప్రముఖంగా శ్వాసకోస వ్యవస్థపై దాడి చేసిన కరోనా వైరస్. ప్రస్తుతం నరాల వ్యవస్థపై కూడా దాడి చేస్తుందని. తద్వారా వాసన రుచి కోల్పోవడమే కాకుండా విపరీతమైన తల నొప్పి వచ్చి తరువాత స్పృహ కోల్పోవడం జరుగుతుందన్నారు. ఇటువంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యసహాయం తీసుకోగలిగితే ప్రాణాపాయం నుండీ తప్పించవచ్చని డాక్టర్ సుమేధ అంటున్నారు.

వీటన్నింటితో పాటు ఇంటి పట్టునే వుండటం సమూహాలకు దూరంగా వుండటం వ్యక్తిగత శుభ్రత పాటించడం వలన కోవిడ్ 19 విపత్తు నుండీ బయటపడవచ్చని ఆయన అన్నారు.

Next Story
Share it