Sneha TV
న్యూస్

ఎంత నిర్లక్ష్యం : 14 ఏళ్లుగా పూర్తికాని వంతెన

ఎంత నిర్లక్ష్యం : 14 ఏళ్లుగా పూర్తికాని వంతెన
X

విజయనగరం జిల్లా కొమరాడ మండలం పూర్ణపాడు లాబేసు వంతెన పనులు వేగవంతం చేయాలని కోరుతూ వంతెన నిర్మించిన స్థలం వద్ద మహిళలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయనగరం జిల్లా కొమరాడ కురుపాం గుమ్మలక్ష్మీపురం జీఎం వలస మండలాలకు సంబంధించిన ప్రజలకు అతిముఖ్యమైన పూర్ణపాడు లాబేసు వంతెన పనులు 2006 సంవత్సరంలో ప్రారంభించారు. పనులు ప్రారంభించి నేటికీ 14 సంవత్సరాలుగా పూర్తయినా ఇంకా వంతెన పూర్తి కాకపోవడం దురదృష్టకరమని గ్రామస్తులు అన్నారు.

ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగా వంతెన పనులు వేగవంతం చేయాలని..గిరిజన ప్రాణాలకు భరోసా కలిగే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లాబేసు గ్రామానికి చెందిన మహిళలు పాల్గొన్నారు.

Next Story
Share it