ఘనంగా ఎంఆర్పీఎస్ 25వ వార్షికోత్సవం
X
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నువ్వూరుపాడు గ్రామంలో MRPS జిల్లా ఇన్ఛార్జ్ శ్రీనివాస్, మాదిగ నాయకులు ఆధ్వర్యంలో MRPS జెండాను ఆవిష్కరించారు. MRPS స్ధాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాష్ట్ర నలుమూలల నుంచి MRPS జెండా ఆవిష్కరణలు జరుతున్నాయని వారు అన్నారు. మాదిగ జాతి అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక వ్యక్తి మందకృష్ణ మాదిగ అని శ్రీనివాస్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు, దేవరపాటి మల్లికార్జున మాదిగ, మహేష్, పొదిలి పుల్లయ్య, గంగపట్ల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Next Story