Sneha TV
న్యూస్

రెండు రాష్ట్రాల సీఎంలు ఎస్సీ సామాజిక వర్గాలను మభ్యపెడుతున్నారు: నేరేళ్ల

X

డా.బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలను స్థాపిస్తామంటూ రెండు రాష్ట్రాల్లోని ఎస్సీ సామాజికవర్గాలను సీఎంలు ఇద్దరూ మభ్యపెడుతున్నారని మాస్టర్ కీ టీవి డైరక్టర్ డా.నేరెళ్ల కోటేశ్వరరావు విమర్శించారు. గతంలోనే ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్‌లలో ఆ మహాశయుడి విగ్రహాలను ఏర్పాటు చేస్తామంటూ కాలయాపన చేస్తున్నారని ఆయన అన్నారు.

అంతేకాకుండా ఏపీలోని సోషల్ వెల్పేర్ డిపార్ట్ మెంట్ సబ్ కాంపోనెంట్ నిధులను వేరే పథకాలకు ప్రభుత్వం మళ్లిస్తున్నారని కోటేశ్వరరావు మండిపడ్డారు. అక్కడితో ఆగకుండా తెలుగు రాష్ట్రాల్లోని ఎస్సీలకు చెందాల్సిన అభివృద్ది పథకాలను ఏదో ఒక సాకుతో అడ్డుకుంటున్నారన్నారు.

Next Story
Share it