Sneha TV
న్యూస్

2036 వరకూ పుతినే రష్యా అధ్యక్షుడు

2036 వరకూ పుతినే రష్యా అధ్యక్షుడు
X

రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్‌ పుతిన్ పదవీ కాలం మరో నాలుగేళ్లు మిగిలిన ఉన్నప్పటికీ ఆయన తన పదవి కాలాన్ని పొడిగించుకునేందుకు కొన్ని నెలలుగా ప్రయత్నాలు జరుపుతున్నారు. రష్యాకు 2036 వరకు తాను అధ్యక్షుడిగా కొనసాగడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు చివరకు ఫలించాయి. 2036 వరకు ఆయనే తమ దేశ అధ్యక్షుడిగా కొనసాగేందుకు ప్రజలు ఆమోద ముద్ర వేశారు.

ఇందు కోసం రాజ్యంగ సవరణకు వారు అంగీకరించారు. కొన్ని రోజులుగా రాజ్యాంగ సవరణ కోసం రష్యా ప్రజల అభిప్రాయాలను సేకరించే పనిలో ఉన్న ఆ దేశ ఎన్నికల సంఘం ఫలితాలు వెల్లడించింది. సుమారు 63 శాతం మంది ప్రజలు ఓట్లు వేయగా, అందులో 73 శాతం మంది పుతిన్‌కు సానుకూలంగా ఓట్లు వేసినట్లు ప్రకటించింది.

Next Story
Share it