Top
Sneha TV

కరోనాకు వ్యాక్సిన్ రె'ఢీ'

కరోనాకు వ్యాక్సిన్ రెఢీ
X
  • ఆగస్టు 15నాటికి ప్రజలకు అందుబాటులోకి
  • భారత్‌ బయోటెక్‌ ఘనత

హైదరాబాద్‌: కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రపంచ దేశాలు వారివారి స్థాయిల్లో వ్యాక్సిన్‌ తయారీకి కృషిచేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌ టీకాను అందుబాటులోకి తెచ్చే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. భారత వైద్య పరిశోధన మండలి తెలిపిన ప్రకారం వ్యాక్సిన్ ను ఆగస్టు 15నాటికి ప్రజలకు అందుబాబులోకి తేవాలన్న లక్ష్యంతో క్లినికల్ ట్రయల్స్ వేగవంతంగా జరిపేందుకు డీసీజీఐ అనుమతి సైతం తీసుకన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు జంతువులపై చేస్తున్న ట్రయల్స్ మాత్రం విజయవంమైనట్లు ఐసిఎంఆర్‌ తెలిపింది.

Next Story
Share it