Top
Sneha TV

మయన్మార్ గనుల్లో ఘోర ప్రమాదం: 162 మంది కార్మికుల మృతి

మయన్మార్ గనుల్లో ఘోర ప్రమాదం: 162 మంది కార్మికుల మృతి
X

మయన్మార్‌లో ఘోరం జరిగిపోయింది. ఓ గని వద్ద మట్టి కుప్పలు విరిగిపడిన ఘటనలో 162 మంది సజీవ సమాధి అయిపోయారు. మయన్మార్‌లోని కచిన్‌ రాష్ట్రం హపకంట్‌ సమీపంలో ప్రపంచంలోనే అతిపెద్ద జేడ్‌ (పచ్చరాయి) గని ఉంది. ఈ గనుల్లో నుంచి తవ్వ తీసిన మట్టిని పక్కనే పోసేస్తుంటారు. కార్మికులు అక్కడే తాతాక్కలిక నివాసాల్లో ఉంటున్నారు.

కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆ మట్టిగుట్ట కార్మికుల ఇళ్లపై పడటంతో ఈ ఘోరం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు 162 మృతదేహాలను వెలికితీసినట్లు మయన్మార్‌ ప్రభుత్వం వెల్లడించింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నట్లు తెలిపింది. గతంలో కూడా ఇదే గనిలో ఇలాంటి సంఘటన జరిగడంతో 113 మంది మృత్యువాత పడ్డారు.

Next Story
Share it