Top
Sneha TV

కాపునేస్తం పథకంపై పవన్ దుష్ఫ్రచారం తగదు: మంత్రి కన్న

కాపునేస్తం పథకంపై పవన్ దుష్ఫ్రచారం తగదు: మంత్రి కన్న
X

కాపు నేస్తం పథకంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కన్నబాబు కౌంటర్ ఇచ్చారు. కాపు నేస్తం అద్భుతమైన పథకమని, కాపు నేస్తం కింద మహిళలకు ఏటా రూ.15వేలు అందిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. కాపుల కోసం ఏడాదిలో రూ.4,769 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. కాపు నేస్తం పథకంపై పవన్‌ కల్యాణ్‌ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు పట్ల ప్రేమను పవన్‌ దాచుకోలేకపోతున్నారని వ్యంగ్యాస్త్రం సంధించారు. ముద్రగడను పచ్చిబూతులు తిట్టినప్పుడు పవన్‌ ఎందుకు స్పందించలేదన్నారు. ముద్రగడ ఉద్యమాన్ని చంద్రబాబు అణచివేశారని, కాపులకు చంద్రబాబు చేసిన మోసాన్ని పవన్‌ ఎందుకు ప్రశ్నించలేదన్నారు.

Next Story
Share it