Top
Sneha TV

ఎస్పీవై ఆగ్రో పరిశ్రమలో గ్యాస్‌ లీక్

ఎస్పీవై ఆగ్రో పరిశ్రమలో  గ్యాస్‌ లీక్
X

కర్నూలు జిల్లా నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో పరిశ్రమలో ప్రమాదం జరిగింది. పరిశ్రమలో గ్యాస్‌ లీకైన ఘటనలో కంపెనీ జనరల్‌ మేనేజర్‌ శ్రీనివాసరావు మృతిచెందారు. ముగ్గురు అస్వస్ధతకు గురయ్యారు.డిస్టిలరీ విభాగంలో దాదాపు రెండు టన్నుల అమోనియా నిల్వ ఉంచారు.

అమోనియా నుంచి కార్బన్‌ డయాక్సైడ్‌ తయారు చేసే సమయంలో పైప్‌ లీకేజ్‌ కారణంగా గ్యాస్‌ వెలువడినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో ఐదుగురు సిబ్బంది ఉన్నారు. విషవాయువు లీకైందన్న భయంతో వారంతా ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు.

గ్యాస్‌ లీకేజీని అదుపు చేసేందుకు ఫైర్‌ సిబ్బంది రంగంలోకి దిగారు. ఆర్డీవో రామకృష్ణారెడ్డి, తహసీల్దార్‌ రవికుమార్‌ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఇటీవలే విశాఖ గ్యాస్‌ లీకేజీ ఘటన నేపథ్యంలో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

Next Story
Share it