Sneha TV
న్యూస్

భూటాన్ - భారత్ ల మధ్య వివాదమా?

భూటాన్ - భారత్ ల మధ్య వివాదమా?
X

అస్సాంకు మన దేశ మిత్ర రాజ్యమైన భూటాన్‌ నీటి సరఫరాను నిలిపివేసిందని, చైనా, నేపాల్‌, పాకిస్థాన్‌ మాదిరిగానే సరిహద్దుల్లో భారత్‌ కు ఇబ్బందులు పెడుతోందని మీడియాల్లో వస్తున్న వార్తల్లో నిజంలేదని భారత ప్రభుత్వం ప్రకటించింది. అస్సాంకు వచ్చే నీటిని భూటాన్‌ నిలిపేసిందంటూ వచ్చిన వార్తలను భూటాన్‌ ఖండించింది. ' నీటి పారుదల సహజంగానే ఆగిపోయిందని, మేము నీటిని నిలిపివేయలేదని ప్రకటించింది. అస్సాంకు సరఫరా అవుతున్న నీటిలో ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని మరమ్మత్తులు కూడా చేయిస్తున్నాం ' అని విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది.

Next Story
Share it