Top
Sneha TV

మాదక ద్రవ్యాల నిరోధక దినం ప్రత్యేకత ఏమిటో?

మాదక ద్రవ్యాల నిరోధక దినం ప్రత్యేకత ఏమిటో?
X

తప్పుడు దారిలో వెళ్తున్న యువతను సన్మార్గంలో నడిపించేందుకే.. గంజాయితో పాటు మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన యువతలో మార్పు తేవాలని ఉద్ధేశ్యంతో ప్రతి సంవత్సరం జూన్‌ 26వ తేదీని అంతర్జాతీయ మాదక ద్రవ్యాల రవాణా వినియోగాల వ్యతిరేక రోజు జరుపుకుంటారు.

మాదక ద్రవ్యాల వినియోగం వలన ప్రపంచ దేశాలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా అమాయక యువత ఈ దుర్వ్యసనం బారిన పడి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నాయి. సరదాకో స్నేహితుల ఒత్తిడి మేరకో జీవితంలో వీటిని ఒకసారి తీసుకున్నారంటే ఆ దురలవాటు నుండి బయటపడటం చాలా కష్టమైన విషయం. వీటి వినియోగం నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఏటా ప్రపంచవ్యాప్తంగా సుమారు రెండు కోట్ల మంది ఈ వ్యసనానికి బలవుతున్నారు.

మాదక ద్రవ్యాలలో నల్లమందు, మార్ఫిన్, హెరాయిన్, చరస్, గంజాయి, మారిజువానా, కొకైన్, ఎల్.ఎస్.డి వంటి రకాలు నల్ల బజారులో అత్యధికంగా చలామణిలో వున్నాయి.. ముఖ్యంగా మెట్రోపాలిటన్ నగరాల్లోని యువత ఈ ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మహానగరాల్లో ఈ చీకటి వ్యాపారం మాఫియా గుప్పెట్లో వుంటుంది.

మాదక ద్రవ్యాల నిరోధానికి భారత ప్రభుత్వం నార్కోటిక్స్, డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సస్ చట్టాన్ని చేసింది.ఎవరైనా మత్తు మందులు పండించినా, వ్యాపారం చేసినా, వాడుతున్నా చట్టపరంగా కఠిన శిక్షార్హులు. ఈ మత్తు మందులకు బానిసలుగా మారిన వారిని మామూలు మనుషులుగా చేయడం కష్టమైన పని. డ్రగ్ అడిక్షన్ కేంద్రాలలో మానసిక వైద్యుల ద్వారా చికిత్స చేయడం ద్వారా వారిని కాపాడవచ్చు.

Next Story
Share it