Top
Sneha TV

అచ్చెన్నపై ఏసీబీ అధికారుల ప్రశ్నల వర్షం

అచ్చెన్నపై ఏసీబీ అధికారుల ప్రశ్నల వర్షం
X

ఇఎస్ఐ స్కామ్ విచారణలో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే పలువురు అధికారులను అరెస్టు చేసిన అధికారులు.. ఈ కేసులో విజిలెన్స్ అధికారుల విచారణలో వెలుగుచూసిన అంశాలపై కూపీ లాగి ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే జిజిహెచ్లో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కోర్టు ఆదేశాలతో విచారణ ప్రారంభించారు. ఈ రోజు కూడా విచారణ కొనసాగుతుంది.
యాంకర్‌
కాగా, ఇఎస్ఐ నిధుల దుర్వినియోగం కేసులో అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు నిన్న విచారించారు. జిజిహెచ్లో అచ్చెన్నను కస్టడీలోకి తీసుకున్న అధికారులు దాదాపు మూడు గంటలపాటు ప్రశ్నించారు. డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో తొలిరోజు విచారణ ముగిసింది. ఇవాళ, రేపు కూడా ఏసీబీ అధికారులు అచ్చెన్నను విచారించనున్నారు. ఆస్పత్రిలోనే అచ్చెన్నను ప్రశ్నించాలన్న కోర్టు ఆదేశాల మేరకు నిన్నసాయంత్రం 5 గంటలకు ఏసీబీ అధికారులు గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌‌ను కలిసిన తర్వాత అచ్చెన్నను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు.

Next Story
Share it